మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ సమాజాన్ని మరియు యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి ( మాదకద్రవ్యాల ) నుండి విముక్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానకి మా వంతుగా సేవ చేస్తామని ముందుకు వచ్చిందే ప్రముఖ సామాజిక సంస్థ సాహితి ఫౌండేషన్ అన్నారు. ఇందులో బాగంగా మత్తు పదార్థాల వ్యతిరేక, ఆరోగ్య అవగాహన మరియు పునరావాసం (ADHAAR – Anti Drugs, HealthAwareness And Rehabilitation ) పేరుతో చేపడుతున్న కార్యక్రమాన్ని అధికారికంగా పోస్టర్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో ఈ రోజు ఉదయం వారి ప్రభుత్వ కార్యాలయాలలో ఆవిష్కరించినట్లు వారు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో డ్రగ్స్ ను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తామని, దీనిలో ఎంతటి వారున్న వదిలి పెట్టమని అన్నారు. సాహితి ఫౌండేషన్ ప్రముఖ సామాజిక సంస్థ ఇంతటి మంచి మరియు అతి పెద్ద సమస్యను తరమివేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమైన అంశం అని, వీరికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. మరొక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సాహితి ఫౌండేషన్ గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేసిందని, మహిళా సాధికారత విషయంలో గాని, యువతకు స్కిల్ లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం లో గాని.. ఇలా చాలా బాగా చేసిందన్నారు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ప్రధాన సమస్య ఈ డ్రగ్స్ మహమ్మారి, దీనిపై మా వంతుగా పోరాడుతామని ముందుకు రావడం చాలా అభినందనీయం, వీరికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కో ఆర్డినేటర్ మార్క సంతోష్ కుమార్, సంస్థ సభ్యులు శ్రీకాంతాచారి మరియు మారుతి పాల్గొన్నారు.
- Home
- సాహితీ ఫౌండేషన్ ఆధార్ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రులు