
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈరోజు హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా హుజురాబాద్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్ లక్ష్మణ్ బాపూజీ అవార్డు అందుకున్నారు. ఉపేందర్ చేనేత సంఘం అధ్యక్షులుగా చేనేత సహకార సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేయగా ఆయనకు ఈ అవార్డు వరించింది. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం పాలకవర్గ సభ్యులు సంఘం సభ్యులు ఉపేందర్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో అవార్డులు, రివార్డులు సాధించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.