మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: స్థానిక పట్టణములో బీలీవర్స్ చర్చి వేదికగా ట్రస్ట్ నిర్వాహకులు వర్షాకాలములో వచ్చే సీజనల్ వ్యాదుల నివారణకు తగు జాగ్రతలు తీసుకొనే విషయమై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమములో డా. ఫిన్ని డి పస్తాం ఫిజీషియన్ శ్రీ సాయి హుజురాబాద్ మాట్లాడుతూ వర్షాకాలములో మురుకు నీటి గుంతలవలన దోమల విస్తరణ ఎక్కువగా ఉంటుందనీ, ప్రతి ఒక్కరూ ఇంటిచుట్టూ నీరు నిలువకుండా పరిశుభ్రముగా ఊంచుకోవాలన్నారు. దోమకాటు బారిన పడకుండా జాగ్రతలు తీసుకొంటూ జంకు ఫుడ్ కి, చల్లటి ఆహార పదార్థాలు ముట్టకుండా ఊంటే ప్రజలు ఆరోగ్య వంతులుగా ఉంటారని తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు జి నవీన్ కుమార్ మాట్లాడుతూ ధనసంపాదనకంటే ఆరోగ్య సంపద గొప్పదని, పతిఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్దవహించాలని సూచించారు. ఈ కార్యక్రమములో 6 వార్డు కౌన్సిలర్ నల్ల లక్ష్మి, నాయకుడి నల్ల సుమన్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. నల్ల సుమన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ట్రస్ట్ నిర్వాహకులు ప్రజలకు మరింత సేవలందించాలని కోరారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో హరితహరము కార్యక్రమము నిర్వహించి 6వ వార్డులో మొక్కలు నాటి మరియు మొక్కల పంపిణీ చేశారు. కాలీ స్థలము ఊన్న చోట ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షంచితే భవిష్యత్ తరానికి మనము ఇచ్చే గొప్ప భవిషత్ అని తెలిపారు. ఈ ఆవగాహన సదస్సుకు హైదరాబాద్, లక్సెటీపేట, మంచిర్యాల్ జమ్మికుంట, కమలపూర్ సైదాపూర్, హుజూరాబాద్ నుండి 80 మందికి పైగా పాల్గొన్నారు.
- Home
- హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యములో సామాజిక అవగాహన సదస్సు