మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కోల్ కత్తాలో డాక్టర్ మౌనితపై జరిగిన అత్యాచార ఘటన పట్ల హుజురాబాద్ పట్టణంలో ప్ల కార్డులతో పలువురు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక వేత్త , కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ… వైద్యులకు రక్షణ లేని పరిస్థితి మంచిది కాదని, వైద్యులు ప్రాణాలను నిలిపే వ్యక్తులని ఆయన అన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నేతలు కేసరి నందన్, మంద సతీష్, బండారి కిష్టయ్య, కొల్లిపాక శంకర్, తిరుపతి, మండల్ సుష్మిత , స్వాతి తదితరులు పాల్గొన్నారు.