మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. మంగళవారం హుజురాబాద్ లోని మధువని గార్డెన్ లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై టీయూడబ్ల్యుజే (ఐజేయు) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో సానుకూలంగా ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం జరుగుతుందని అన్నారు. హుజురాబాద్ జర్నలిస్టులకు కేటాయించిన భూమిలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం జరిగి ఉందని, కోర్టు కేసుతో పాటు ఈఎన్ సీ సర్టిఫికెట్ ఇప్పించేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అడహక్ కమిటీ కో -కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణ, ఎండి మక్సుద్, పరంకుశం కిరణ్ కుమార్, చిలుకమారి సత్యరాజ్, కేదాసి శ్రీధర్, పబ్బ తిరుపతి, టేకుల సాగర్, పోతారాజ్ సంపత్, జెమిని శ్రీనివాస్, గోస్కుల రాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.
- Home
- హుజురాబాద్ జర్నలిస్టుల సమస్య సీఎం దృష్టికి తీసుకు వెళ్తా…! -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు