ప్రజల సమస్యలే మా ఎజెండా..మాకు పదవులు కాదు… ప్రజలే ముఖ్యం! -సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి కూనమనేని సాంబశివరావు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వందల సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల తరపున పోరాడుతుందని, మాకు పదవులు ముఖ్యం కాదని ప్రజలే ముఖ్యమని, అందుకే ప్రభుత్వంలో పదవులు తీసుకోలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సిపిఐ ఎల్లప్పుడు పేదల పక్షపాతిగా ఉంటూ పేదల సమస్యలపైనే పోరాటం చేస్తుందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎదురు చూస్తాయి కానీ కమ్యూనిస్టు పార్టీ ప్రజల సమస్యల పరిష్కారమే గీటురాయిగా ముందుకు వెళుతుందని అన్నారు. పేదల గుండెచప్పుడు ఎర్రజెండా పార్టీ, కమ్యూనిస్టు పార్టీనే శరణ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. హిందూ మతం అందరిదీ అని, కానీ బీజేపీ వాళ్ళు హిందూ మతాన్ని హైజాక్ చేస్తామని చూస్తున్నారని అన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పాచికలు కేవలం తెలంగాణలోనే పారాయని మిగతా ప్రాంతాల్లో బిజెపి అడ్రస్ గల్లంతయిందని అన్నారు. రాముడు ఆదర్శ పురుషుడు. ఆయన చాలామందికి ఆరాధ్య దేవుడు, కానీ బిజెపి ఓట్ల కోసం రాముడిని తమ పేటెంట్ హక్కుగా భావించిందని అన్నారు. బిజెపి పాచికలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో పారలేదని పేర్కొన్నారు. ఓట్లు ఏ పేరుతో పడతాయో చూసి బీజేపీ రాజకీయం చేస్తున్నారని, వారికి ఓట్లపై తప్పా జనాల పై ప్రేమలేదు అని ఎద్దేవా చేశారు.ఆదాని, అంబాణీల కోసమే బీజేపీ పనిచేస్తుందని కార్పొరేట్ శక్తుల కు బిజెపి తొత్తుగా ఉంటుందని అన్నారు.
రుణమాఫీ ఇవ్వకుంటే మేము కాంగ్రెస్ పార్టీ తరుపున కాదు రైతుల తరుపున ఉంటామని, మనిషి ఉన్నంత కాలం కమ్యూనిస్టు పార్టీ బతికి ఉంటుందని,బద్దం ఎల్లారెడ్డి…సాయుధ పోరాట ప్రభావమే ఈ తెలంగాణ రాష్టం ఏర్పాటని అన్నారు. ఎర్రజెండా లేని దేశం లేదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని అన్నారు.దళిత బంధు రాని వారికి ప్రతిపైసా ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి కొన్ని రోజులే అయింది కాబట్టి తప్పులు దిద్దుకోవడానికి ఆ పార్టీకి సమయం ఇస్తున్నాం సరిచేసుకోండని ఆయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సిపిఐ నాయకులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ…. సిపిఐ 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ అని ఎర్రజెండా అంటేనే పేదల సమస్యల కోసం ఉన్న పార్టీ అని తెలంగాణలో పేరు ఉందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్య తీర్చడానికి ప్రభుత్వం నకు కొంత సమయం ఇచ్చి వారు తీర్చకపోతే ప్రజలతో కలిసి వాటిని వారికి అందజేస్తామని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ…. పేదల పక్షపాతిగా ఉన్న సిపిఐ వారి ప్రయోజనాల కోసం ఎన్నో పోరాటాలు చేసిందని అన్నారు. పేద ప్రజల పక్షాన నిలబడి కనబడే పార్టీ సిపిఐ అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్, నాయకులు సదానందం, హుజురాబాద్ కార్యదర్శి గోవిందుల రవి, పొన్నగంటి కేదారి, కొయ్యడ సృజన్ కుమార్ బోయిన అశోక్, సురేందర్ రెడ్డి, గూడెం లక్ష్మి, వెంకటేష్, కేశ బోయిన రాము, రాజు, లంకదాసరి కళ్యాణ్, కృష్ణ, రోహిత్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!