ఘనంగా ప్రపంచ మానవతావాద దినోత్సవం


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ద్రవిడ మహాసభ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ వాద దినోత్సవం సందర్భంగా సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ.. మనుషులంతా అసూయతో దూరము అవుతున్నారని, అందరూ కలిసి మెరిసి జీవించినప్పుడే సమాజం ప్రపంచం బాగుపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ద్రవిడ మహాసభ నాయకులు రామ్ రాజేశ్వర్, జేఏసీ చైర్మన్ అవునూరి సమ్మయ్య, న్యాయవాది ముక్కెర రాజు, పల్కల ఈశ్వరరెడ్డి, మిదిదొడ్డి శ్రీనివాస్, కట్కురి రాజేందర్, మోరే సతీష్ , వేల్పుల రత్నం, ఆడేపు సురేందర్, రొంటాల సుమన్, రాం సారయ్య, తునికి సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ జన సాహితీ కన్వీనర్ అవునూరి సమ్మయ్య విజ్ఞాన వికాస కేంద్రంకు పుస్తకాలు గవాయి, గమనం, గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్ ఆత్మీయ సమ్మెళనం FIRST BATCH 1969-71 10TH జూన్ 2022 SOUVENIR ప్రభుత్వ జూనియర్స్ కాలేజీ హుజురాబాద్ ,ఈ పుస్తకాలు రొంటాల బుచ్చయ్య హ్యుమానిస్ట్ మానవ వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శికీ అందచేశారు. విజ్ఞాన వికాస కేంద్రం ఆఫీస్ ఖర్చులకు ఒక వేయి రూపాయలు కూడ ఇవ్వడం జరిగిందనీ రొంటాల బుచ్చయ్య తెలిపారు. సందర్భంగా సమ్మక్క ప్రత్యేక ధన్యవాదములు చెప్పడం జరిగింది. అవునూరి సమ్మయ్య మాట్లాడుతూ మంచి విజ్ఞాన వికాస కేంద్రం మంచి ఆలోచన గ్రంధాలయం లాంటిది ఇందులో విద్యార్థులు, యువత, ఉద్యమ కారులు సామాజిక కార్యకర్తలు, ప్రతీ ఒక్కరు పాల్గోని దేశ చరిత్ర తెలుసుకోవాలన్నారు. మానవ వాలికి మంచి మార్గం కోసం పనీ చేయడానికి అంబేద్కర్, పూలే లాంటి గొప్ప నాయకుల గురించి ఇంక తెలుసుకోవడానికి పనీ చేస్తుందనీ, అదే విధంగా విజ్ఞాన వికాస కేంద్రం, నిర్వహణ మానవ వికాస వేదిక చేస్తుందనీ, ఇది ఒక రిజిస్టర్ సంస్థ దీనికి మీరు సందర్శించి చదవండి, చదివించండి, అవసరం అయితే ఆర్థిక సహాయ సహకారం అందంచండి అనీ సందేశం ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాది పాక సతీష్, నాయకులు, తిప్పరపు గోపీ, సోషల్ వర్కర్ అశోక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!