గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. -గణేష్ ఉత్సవాలు -2024 సన్నాహక సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు

మట్టి విగ్రహాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి….

నగరంలో రోడ్ల మరమత్తులు పూర్తి చేయాలి

నిమజ్జనం కోసం టస్కర్ వాహనాలు ,క్రేన్లు సిద్ధం చేయాలి

-గణేష్ ఉత్సవాలు -2024 సన్నాహక సమావేశం లో మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ 27: హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో MCRHRD లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగే గణేష్ ఉత్సవాలు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాదిగా పాల్గొన్న అవకాశం ఉన్నందున చేయాల్సిన ఏర్పాట్ల పై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు డిపార్ట్మెంట్ ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగే గణేష్ ఉత్సవాల కోసం అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సోషల్ మీడియా ఇతర శాంతి భద్రతల సమస్య వస్తె కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో రంజాన్ , మొహర్రం , బోనాలు విజవంతంగా జరుపుకున్నామని గణేష్ ఉత్సవాలు కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా జరుకోవాలన్నారు. పోలీస్, విద్యుత్, రవాణా, ఆర్టీసి, మెట్రో ,జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గత సంవత్సరం కంటే 10 శాతం విగ్రహాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో 141 లాగింగ్ పాయింట్స్ దగ్గర త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. బేబీ పాండ్స్ ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ
సుప్రింకోర్టు తీర్పు కు అనుగుణంగా pop విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను పూజించేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 7 జోన్ల పరిధిలో జోనల్ కమిషనర్, డిసిపిలతో మండపాల నిర్వాహకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సూచించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పర్యావరణ మట్టి విగ్రహాలు పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉత్సవాల్లో భాగంగా వివిధ విభాగాల అధికారులు సమన్వయంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు దిశా నిర్దేశం చేశారు. సెప్టెంబర్ 7-17 మధ్య జరిగే గణేష్ ఉత్సవాల్లో లా అండ్ ఆర్డర్ విషయంలో ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు పై వివరించారు. నిమజ్జనం త్వరగా పూర్తి అయ్యేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ ల పరిధిలో తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేసేటప్పుడు పూర్తిగా మునిగేలా జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ ఏర్పాట్లు చేయాలని లేదంటే అక్కడికి భక్తులు అధికంగా వచ్చి ఇతర విగ్రహాలు నిమజ్జనం ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి వెంట వెంటనే తొలగించాలని సూచించారు. పండగ లోపు రోడ్ల మరమత్తులు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు నిమజ్జనం కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని టస్కర్ వాహనాలు ,డ్రైవర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండపాల నుండి నిమజ్జనం వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి వినాయకుడితో ఒక పోలీస్ ఉంటే త్వరగా నిమజ్జనం కావడానికి అవకాశం ఉంటుందని సూచించారు. హైదరాబాద్ సిటీలోనే కాకుండా శివారు ప్రాంత ట్యాంక్ లలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

గణేష్ ఉత్సవాలు జరిగే 11 రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ విషయంలో తీసుకోవాల్సిన చర్యల పై సూచించారు దూల్ పెట్ లో విగ్రహాల తీసుకుపోవడానికి అధిక ట్రాఫిక్ ఉంటుందని అక్కడ రోడ్లు ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, జంక్షన్ లో వద్ద మండపాలు ఏర్పాటు చేయవద్దని ఉత్సవ కమిటీలకు సూచించారు. పెద్ద వినాయకులు వెళ్ళే ప్రాంతాల్లో ట్రీ ట్రిమ్మింగ్ చేయాలని, చిన్న విగ్రహాలను టస్కర్ లాంటి పెద్ద వాహనాలు కాకుండా చిన్న వాహనాలు వాడితే పెద్దగా ఇబ్బందులు ఉండవన్నారు. ఫిట్నెస్ ఉన్న వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలని, మంచి డ్రైవర్, డీజిల్ కూడా అదనంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లో విగ్రహాల నిమజ్జనానికి 22 ప్లాట్ ఫారంలు ఏర్పాటు చేస్తున్నామని హెచ్ఎండిఎ కమిషనర్ వెల్లడించారు. ట్యాంక్ బండ్ పైన 33 క్రెన్స్ పెడుతున్నామని అదనంగా అవసరం ఉంటే మరిన్ని క్రేన్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 స్టాటిస్టిక్ క్రేన్స్,150 మొబైల్ క్రేన్ ఏర్పాటు చేయనున్నారు. ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువ విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశామని అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 10,500 మంది నిమజ్జనం ప్రాంతంలో శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు . నిమజ్జనం తరువాత వెస్టీజ్ కవరేజ్ డంప్ కోసం 100 టిప్పర్స్ ,20 జేసిబి లు ఏర్పాటు చేశారు. ఈసారి జీహెచ్ఎంసీ ,హెచ్ఎండిఎ నుండి 5 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. అర్అండ్ బి అధికారులు బారికేడ్ల విషయంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలనీ సూచించారు.

ఖైరతాబాద్ దగ్గర డిమాండ్ మేరకు ఉత్సవాల సమయంలో అర్థరాత్రి వరకు మెట్రో నడిపిస్తమని నిమజ్జనం సమయంలో అర్థరాత్రి వరకు 1-2 వరకు నడుస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా అదనంగా మెట్రో నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎంటీఎస్ రైళ్లు అదనంగా నడవడం, 650 వరకు అందనంగా ఆర్టీసి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. 2000 మంది కళాకారులతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కల్చరల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా సిద్ధమవుతుంది. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు విద్యుత్ ఉద్యుగులతోనే తీసుకోవాలని లేదంటే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఉత్సవాల కోసం 57 ట్రాన్స్ ఫార్మర్లు ,22 మొబైల్ ట్రాన్స్ ఫార్మర్లు ,3457 మంది విద్యుత్ సిబ్బంది పని చేయనున్నారు. ప్రధాన రోడ్లు ,గల్లీలో విద్యుత్ కేబుల్ లు వ్రేలాడకుండా చూడాలని ఆదేశించారు. 108 అంబులెన్స్ లు ప్రత్యేక వైద్య సిబ్బంది ,నిమజ్జనం జరిగే ప్రాంతంలో ప్రాథమిక చికిత్స కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఉన్న 4 ప్రధాన వినాయక దేవాలయాలలో నవరాత్రి ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి తో పాటు పలు కమిటీ లు ప్రభుత్వం దృష్టికి పలు అంశాలు తీసుకొచ్చారు. భక్తులకు మొబైల్ టాయిలెట్స్ , మంచి నీటి సౌకర్యం ,భక్తులకు ఆహార ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసులు అనుమతులు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి మాట్లాడుతూ నగరంలో రోడ్ల మరమత్తులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుండి స్వయంగా అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షిస్తన్నారు. బేబీ పాండ్స్ లో ఫ్రెష్ వాటర్ ఉండేలా చేయడంతో నిమజ్జనం జరుగుతున్న చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మోతే శ్రీలత శోభన్ రెడ్డి, డీజీపీ జితేందర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు,హైదరాబాద్, రాచకొండ కమిషనర్లు హైదరాబాద్ నగర ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!