
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వరంగల్ వారి ఆధ్వర్యంలో హుజురాబాద్ లోని హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంకు ప్రజల నుండి చక్కని స్పందన లభించింది. ఈ వైద్య శిబిరానికి వాకర్స్ తో పాటు పట్టణానికి, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు సుమారు వెయ్యి మంది పాల్గొని హాస్పిటల్ వారు కల్పించిన ఉచిత బిపి, షుగర్, ఈసీజీ వంటి సదుపాయాలతో పాటు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా వినియోగించుకున్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని హాస్పిటల్ డైరెక్టర్ పుల్లూరి కళింగరావు సందర్శించి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకై ఎప్పటికప్పుడు ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వైద్యులు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



