
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో భిక్ష కార్యక్రమం నిత్య అన్నదానం (ప్రసాద వితరణ) ఆదివారం ఆలయ నిర్వహణ కమిటీ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా నేటి నుండి వచ్చే నెల 10-01-2025 వరకు మధ్యాహ్నం 12:30 గంటల నుండి రెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. అయ్యప్ప మాల ధారణ భక్తులు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకూలతో పాటు గురుస్వాములు, అయ్యప్ప మాల ధారణ భక్తులు పాల్గొన్నారు.


