
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (నిర్మల్): మంగళవారం నిర్మల్ పట్టణం,ఖానాపూర్, బైంసా లోని ప్రైవేట్ పాఠశాల టీచర్ లతో పాటు, పట్టభద్రులతో M.L.C అభ్యర్ధి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ తనను గెలిపించినట్లయితే ఆరు సంవత్సరాల కాలానికి పొందే జీతం మొత్తాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ -కరీంనగర్-నిజామాబాద్ -మెదక్ పట్టభద్రుల M.L.C నిజయోజకవర్గ నిరుద్యోగుల మరియు ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి ఉపయోగిస్తానని హామీ ఇచ్చారు. తనకు గన్ మాన్ లు కూడా అవసరం లేదని మీలో ఒకడిగా వుంటూ నిరుద్యోగుల సమస్యలపై గళం విప్పుతానని హామీ ఇచ్చారు. అలాగే ప్రైవేట్ టీచర్స్ కు మరియు నిరుద్యోగులకు 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్సు కలిపిస్తానని హామీ ఇచ్చారు. ఎల్లవేళలా నిరుద్యోగులందరికీ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చిన్న 24 గంటలు తన ఫోన్ ఆన్ లో ఉంటుందని ఫోన్ నంబర్ 9985401894 కు సంప్రదించాలని కోరారు. ఈ నెల 27న జరిగే ఎన్నికలలో సీరియల్ నంబర్ :47 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో TRSMA నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పుండ్రూ సుధాకర్ రెడ్డి, స్టేట్ ఈసి మెంబెర్ షబ్బీర్, నిర్మల్ జిల్లా ట్రస్మా సెక్రటరీ పాడాల ప్రభాకర్ ,జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతిర్మయి, నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ అయ్యన్న శ్రీధర్ లా 8 మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.






