Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల సంఘం రూపొందించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారి, తహసిల్దార్ జక్కుల నరేందర్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం రూపొందించిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా అధికారులు నిర్వహించడానికి పోటీ చేసే అభ్యర్థులు పాటించాలని, నిబంధనలో అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రచార విషయంలో ర్యాలీల విషయంలో తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని అన్నారు ప్రచార ఖర్చులు కూడా ఎన్నికల సంఘం రూపొందించిన ప్రకారం వార్డు సభ్యుల 30000, సర్పంచ్ అభ్యర్థులు 1,50,000 కంటే మించరాదని అన్నారు. ఎన్నికల సమయంలో సైతం ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడానికి ఎలాంటి వాహన సౌకర్యం కల్పించడం నేరమని అన్నారు. ఓటర్లు తమ సొంత ఖర్చు పైనే పోలింగ్ బూత్ కు రావాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయం పొందిన వారు విజయోత్సవ ర్యాలీ చేయడానికి అనుమతి లేవని ముందస్తు అనుమతి తీసుకున్న వారికి మాత్రమే మరుసటి రోజు విజయోత్సవ ర్యాలీ చేసుకోవాలని అన్నారు. టౌన్ సీఐ టీ కరుణాకర్ మాట్లాడుతూ… ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 144వ సెక్షన్ అమలులో ఉందని ర్యాలీలు సమావేశాలు ముందస్తు అనుమతి లేకుండా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రచార సమయంలో నలుగురి కన్నా ఎక్కువ ఉండరాదని అన్నారు. శిక్షకుడు టీ మాధవరావు మాట్లాడుతూ…అభ్యర్థులు ఎన్నికల కోసం ఖర్చులు తప్పనిసరిగా బిల్లులు ఉండాలని ఎప్పటికప్పుడు అధికారులకు సమర్పిస్తూ ఉండాలని అన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించి వారి వద్ద నుండి సర్టిఫికెట్ తీసుకోవాలని లేని వారికి మరో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సహాయ అధికారిని, ఎంపీడీవో తూర్పాటి సునీత, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ సుస్మితారావు పలువురు అధికారులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న టౌన్ సిఐ కరుణాకర్.. సభా వేదికపై తాసిల్దార్ నరేందర్, ఎంపీడీవో, ఎన్నికల శిక్షకుడు, ఎక్స్పెండిచర్, పరిశీలకులు..





