
-గత స్మృతులను గుర్తు చేసుకున్న స్నేహితులు
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ హైస్కూల్లో 1997 -98 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం హుజురాబాద్ పట్టణంలోని మధువన్ గార్డెన్ లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి గత స్మృతులను స్నేహితులు గుర్తు చేసుకున్నారు. విద్యార్థి జీవితం ఎంతో ఆనందదాయకమని అలాంటి గత జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కలగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యు రాజయ్య, పున్నం చందర్, ప్రతాపరెడ్డి, పద్మ, శ్రీనివాస్, సుభాష్, ప్రతాప రాజు తదితరులు పాల్గొన్నారు.