Oplus_16908288
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


పీఆర్సీ ప్రకటనలో ఆలస్యం: ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీ (PRC)ని ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించకపోవడం దారుణమన్నారు.
నిలిచిపోయిన రిటైర్మెంట్ బెనిఫిట్స్: ఉద్యోగులకు అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హెల్త్ కార్డ్స్ విఫలం: ప్రభుత్వం నూతన హెల్త్ కార్డులు ఇచ్చినప్పటికీ… అపోలో, మెడికవర్, మెడికేర్, సన్ షైన్ వంటి కార్పొరేట్ ఆస్పత్రులు క్యాష్‌లెస్ చికిత్స అందించేందుకు సహకరించడం లేదని, బాధితులను బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేక ప్రచారం: పీఆర్సీ ప్రకటించకపోతే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.



విరాళం అందజేత:
కార్యక్రమ నిర్వహణ నిమిత్తం దివంగత బోర్గాల మల్లయ్య (రిటైర్డ్ LFL HM) జ్ఞాపకార్థం ఆయన కుమారులు డాక్టర్ రాజమోహన్, రామ్మోహన్, రాజేంద్రప్రసాద్‌లు రూ. 10,116ల విరాళాన్ని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హుజూరాబాద్ యూనిట్ అధ్యక్షుడు గంజి జయవర్ధన్‌కు అందజేశారు. కాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సందర్భంగా ఉస్మాన్ పాషను రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల, డివిజన్, జిల్లా నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఉస్మాన్ పాష, జిల్లా ప్రధాన కార్యదర్శి జాలి మహేందర్ రెడ్డి, నాయకులు గంజి జయవర్ధన్, నరెడ్ల రాజమణి, శ్రీనివాసరావు, వి గోపాల్ రావు, ఆవునూరి సమ్మయ్య, రమణారెడ్డి, దుర్గాజి, జమదగ్ని, శ్రీహరి, లక్ష్మీనారాయణ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.





