
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 30 వ వార్డులో ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.


30వ వార్డు చైర్పర్సన్ సుహాసిని వార్డు కావడంతో తన వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆమె అధికారులతో కలిసి వార్డులో వివిధ ప్రాంతాలను సందర్శించి సమస్యలను పరిష్కరించడానికి అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈ కార్యక్రమంలో కమిషనర్ బండి కిషన్, మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, ఏఈ నరేష్, టౌన్ ప్లానింగ్ శ్రీకాంత్, ఆర్ ఐ శ్రీకాంత్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వినయ్, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వినయ్, వేణు, వార్డ్ ఆఫీసర్ అశోక్, జవాన్ అనిల్, పి రాజు, మున్సిపల్ సిబ్బంది శ్రీధర్, వీరస్వామి బిక్షపతి, హరితహారం సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





