
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామ శివారులోని కరీంనగర్ -వరంగల్ జాతీయ రహదారి 563 పక్కనగల వ్యవసాయ బావిలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ లభించింది. బావిలో మృతదేహం ఉన్న విషయం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బావిలో నుండి మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది సహాయంతో బయటకు తీశారు. మృతుడు బ్లూ షర్ట్ జీన్స్ ప్యాంటు వేసుకొని బాబా తాయత్తు మెడలో కలిగి ఉన్నాడు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కావచ్చు అని భావిస్తున్నారు. మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ తెలిపారు. మృతుడి సమాచారం ఎవరికి తెలిసిన పోలీస్ స్టేషన్ కు గానీ, సంబంధిత వివరాలు తెలిసిన వారు :
1.ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హుజురాబాద్ టౌన్ టి. కరుణాకర్ (ఫోన్ నంబర్: 8712670773)
2. సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి. శ్రీనివాసరావు (ఫోన్ నంబర్: 9908833022) ను సంప్రదించగలరని హుజురాబాద్ టౌన్ పోలీసులు తెలియజేయాలని ఆయన కోరారు.





