
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయితీ పరిధిలోని అర్టిసీ బస్టాండ్ కు సమీపాన ఉన్న ప్రైవేట్ భూమి 967/ఎలో 14గుంటల భూమిని గ్రామపంచాయితీ ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం రహదారికి 5ఫీట్ల స్థలం వదలకుండా 8ఫ్లాట్లుగా విభజించి, అక్రమార్గంలో 1-2 ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనపై పత్రికలలో వచ్చిన కథనాలకు గ్రామ ఉప సర్పంచ్ నేరేళ్ల శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు వారం రోజుల క్రితం ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం హుజురాబాద్ సబ్ డివిజనల్ పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఎంపివో రాజేందర్, గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి, ఉప సర్పంచ్ నేరేళ్ల శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి బానోతు రమేష్‌లు సంబంధిత భూ యజమానిపై భూమి క్రయవిక్రయాలపై నాలుగు గంటల పాటు సమగ్ర న్యాయ విచారణ జరిపారు. బస్టాండ్ కు 200 గజాల దూరంలో ఉన్న ఈ 14గుంటల భూమిపై రెవెన్యూ అధికారులు 2023లో వ్యవసాయ భూమి అని అమోదింపజేసి పట్టాదారు నుండి ఆయన భార్యపై రిజిస్ట్రేషన్ చేసారు. ఈ భూమి క్రయవిక్రయాలలో ఎలాంటి గ్రామపంచాయితీ అనుమతులు లేకుండా నాలా పన్ను చెల్లించకుండా ప్లాట్లుగా విభజించి హద్దులు పాతడంతో గ్రామంలో సమస్య తలెత్తితింది.
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గ్రామపంచాయితీ సర్పంచ్, కార్యదర్శితో పాటు పాలకవర్గం పలువురు సభ్యులు పెన్సింగ్, హద్దులను పీకేసి పంచాయితీ కార్యాలయం ఆవరణలో పడేసారు. ఈ సంఘటనపై పత్రికలలో వచ్చిన కథనాలకు రెండు మాసాల క్రితం డిఎల్పివో శ్రీనివాస్, పంచాయితీలోని 1వ వార్డులో రెండు, మూడు చోట్ల పంచాయితీ రహదారులను 5-10 ఫీట్ల మేర ఆక్రమించుకుని అమ్మచూపడంతో వార్డు ప్రజలు ఫిర్యాదు చేసారు. వెంటనే స్పందించిన పంచాయితీ అధికారులు ఈ భూమిని పంచాయితీ అనుమతులు లేనీదే ఎవరు కొనరాదూ.. అమ్మరాదు అని బ్యానర్ కట్టారు. ఈ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ భూ యజమాని అడ్డదారిలో ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి మరో ప్లాటు రిజిస్ట్రేషన్ చేస్తున్న తరుణంలో ఫిర్యాదులు అందడంతో హుజురాబాద్ సబ్ రిజిస్టర్ మద్యంతరంగా భూమి మోఖాపై వచ్చి విచారణ జరిపి రిజిస్ట్రేషనను నిలిపివేసారు. ఈ సంఘటన తెలుసుకున్న గ్రామపంచాయితీ పాలకవర్గం ఆ మరునాడు లిఖిత పూర్వకంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 967/ఎ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరపారాదని ఫిర్యాదు చేసారు. ఇంత వరకు సజావుగానే జరిగినప్పటికి అదే భూమిలో దసరా తెల్లవారి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దిదారునికి ఆ భూమిలో ముగ్గుపోయడం వివాదస్పదంగా మారింది. దీనిపై ఉప సర్పంచ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో మంగళవారం మరో మారు డిఎల్పివో విచారణకు గ్రామానికి వచ్చారు. జరుగుతున్న పరిణామాలపై డిఎల్పివోను స్వర్ణోదయం ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు జరుగుతే, రిజిస్ట్రేషన్ రద్దుకు సిఫారసు చేస్తామని డిఎల్పివో తెలిపారు. గ్రామంలో గతంలోను ప్రస్తుతం నిర్మాణం అవుతున్న వాడలలోను కనీసం గ్రామపంచాయితీ నిబంధనలు తుంగలో తొక్కి రహదారులపై ర్యాంపులు, మెట్లు ఇష్టానుసారంగా నిర్మాణాలు జరుగుతున్న పంచాయితీ పాలకవర్గం స్పందించకపోవడంతో గ్రామంలో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.





