
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. గత ఏడాదిన్నర క్రితం గంగుల తండ్రి మృతిచెందగా ఇప్పుడు తల్లి మృతి చెందడంతో గంగుల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలియగానే కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ యాదగిరి సునీల్ రావు, టిఆర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున నర్సమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. గంగుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
